हिन्दी | Epaper

Peddi Movie: శ్రీరామనవమి స్పెషల్‌గా ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో రిలీజ్

Sharanya
Peddi Movie: శ్రీరామనవమి స్పెషల్‌గా ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది‘. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తుది దశ పనుల్లో ఉంది. ఇప్పటికే టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ అభిమానుల్లో క్రేజ్ నింపగా, తాజాగా శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్‌లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

గ్లింప్స్‌లో చెర్రీ మాస్ డైలాగ్ మెరుపులు

గ్లింప్స్‌లో రామ్ చరణ్ కనిపించిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాంధ్ర యాసలో ఆయన చెప్పిన డైలాగ్ – “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి పుడాతామా ఏంటి మళ్లీ” అనేది మాస్ ప్రేక్షకులను థియేటర్లలో పూనకం తెప్పించేదిగా మారింది. ఈ ఒక్క డైలాగ్ చాలు చెర్రీ ఈ సినిమాలో ఏ స్థాయిలో రెచ్చిపోయాడో తెలుస్తోంది. డైలాగ్ డెలివరీలోని పవర్, యాసలోని ఒరిజినాలిటీ, రియలిస్టిక్ ప్రెజెంటేషన్ అభిమానులకు గూస్‌బంప్స్ ఇచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇది ఆమె టాలీవుడ్‌లో రెండవ సినిమా. ఇద్దరి జోడీపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. గ్లింప్స్‌లో అయితే ఆమె కనిపించకపోయినా, పోస్టర్స్‌లో ఆకట్టుకున్నారు. సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పని చేస్తుండటం అభిమానుల్లో భారీ అంచనాలను రేపింది. బుచ్చిబాబు స్టైల్‌కు, రెహమాన్ క్లాస్ మ్యూజిక్ మిక్స్ అయితే వచ్చే బీజీఎంలు, పాటలు యూనిక్ గానే ఉండబోతున్నాయి. ఇప్పటికే బిజీగా ఉన్న రెహమాన్.. ‘పెద్ది’ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నారని సమాచారం. సినిమా విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించబడింది. 2026, మార్చి 27న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదే తేదీన గతంలో RRR రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. దీంతో మళ్లీ అదే టైమ్‌ఫ్రేమ్‌లో చెర్రీ వస్తుండటంతో బిజినెస్‌ వర్గాల్లో హైప్ మామూలుగా లేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లిక్కర్ స్కామ్.. A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

లిక్కర్ స్కామ్.. A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

సూపర్-8 మ్యాచ్‌కు వర్షం అడ్డంకి, టాస్ గెలిచిన పాకిస్థాన్

సూపర్-8 మ్యాచ్‌కు వర్షం అడ్డంకి, టాస్ గెలిచిన పాకిస్థాన్

ఒకే పార్కులో 72 పులులు మృతి

ఒకే పార్కులో 72 పులులు మృతి

జగన్ పై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం

జగన్ పై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

పవన్ కల్యాణ్ చొరవతో కొణిదెల గ్రామం అభివృద్ధి దిశగా

పవన్ కల్యాణ్ చొరవతో కొణిదెల గ్రామం అభివృద్ధి దిశగా

ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు

ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

📢 For Advertisement Booking: 98481 12870