తమిళనాడు డీఎంకే మంత్రి శేఖర్ బాబు (Sekhar Babu) చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ (Pawan) చెన్నై నుంచి గెలవగలరా? అని ఆయన సంశయం వ్యక్తం చేయడం పట్ల తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏ.ఎన్.ఎస్. ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ పోటీ చేయకపోయినా, కేవలం కొళత్తూరు నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తే చాలని, డీఎంకే అధికారానికి అదే ముగింపు కావచ్చని ప్రసాద్ వ్యాఖ్యానించారు. 2026లో సీఎం స్టాలిన్ తిరిగి గెలుస్తారా అన్నదానిపై శేఖర్ బాబు దృష్టి పెట్టాలంటూ ప్రసాద్ సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ ప్రభావం, డీఎంకే క్షీణించే ప్రజాదరణ
2011లో స్టాలిన్ కొళత్తూరులో కేవలం 2,734 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు పరిస్థితి బీజేపీకు అనుకూలంగా మారిందన్నారు. డీఎంకే ప్రజాదరణ తగ్గుతుండటంతో శేఖర్ బాబు ఇలా స్పందించటం హాస్యాస్పదమన్నారు. ఎన్డీయే కూటమి నేతృత్వంలోని బీజేపీ కార్యకర్త కూడా 2026లో కొళత్తూరులో స్టాలిన్‌ను ఓడించగలడని ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. నైనార్ నాగేంద్రన్ నాయకత్వంలో, అమిత్ షా వ్యూహాత్మక సమన్వయంతో బీజేపీ తమిళనాడులో పునాదులు బలంగా వేసుకుంటోందని ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు తమిళనాడుతో అనుబంధం, డీఎంకేపై విరుచుకుపడిన ప్రసాద్
పవన్ కల్యాణ్ తెలుగువారు అయినా, చెన్నైలోనే పెరిగారని, తమిళ భాషపై ఆయనకు అవగాహన ఉందని ప్రసాద్ గుర్తుచేశారు. మదురైలో జరిగిన మురుగన్ భక్త సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం భక్తులను ఆకట్టుకుందని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం హిందువుల మనోభావాలను కించపరుస్తూ, ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయ నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మదురై సభ ద్వారా లక్షలాది భక్తులు కంద షష్ఠి కవచం పఠిస్తూ, ఆధ్యాత్మిక ప్రతిస్పందనను అందించారని ప్రసాద్ పేర్కొన్నారు.
Read Also : Oman :ఒమన్ లో ధనవంతులకు 5 శాతం ఇన్ కమ్ ట్యాక్స్