हिन्दी | Epaper

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

Sudheer
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు తన విచారణ పరిధిని మరింత విస్తరించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు అందాయి. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ కేసులో పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు అరెస్ట్ కాగా, ఇప్పుడు నేరుగా ఒక కీలక రాజకీయ నాయకుడికి నోటీసులు రావడం గమనార్హం.

BRS re entry : బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ? మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్!

హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వడం వెనుక ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ఇచ్చిన స్టేట్మెంట్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం లేదా ఆ ప్రక్రియలో జరిగిన కొన్ని అంతర్గత విషయాలపై సదరు ఎండీ ఇచ్చిన వాంగ్మూలంలో హరీశ్ రావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీనిపై స్పష్టత కోసమే సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. గతంలో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారాన్ని, ఈ కొత్త స్టేట్మెంట్‌ను బేరీజు వేస్తూ అధికారులు ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు భోగట్టా.

ప్రస్తుతం హరీశ్ రావు ఈ విచారణకు హాజరవుతారా లేక న్యాయపరమైన సలహాలు తీసుకుని గడువు కోరుతారా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే, అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఈ కేసు కేవలం అధికారులకే పరిమితం కాకుండా, రాజకీయ అగ్రనేతల వైపు మళ్లుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు, అధికార పక్షం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870