हिन्दी | Epaper

India – Pakistan War : పాక్ కు ఆయుధాలు ఇవ్వలేదు – చైనా

Sudheer
India – Pakistan War : పాక్ కు ఆయుధాలు ఇవ్వలేదు – చైనా

భారత–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల (India – Pakistan War) నేపథ్యంలో పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు (Chinese weapons to Pakistan) సరఫరా చేస్తోందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యాపించాయి. ముఖ్యంగా చైనా Y-20 మిలిటరీ కార్గో విమానం ద్వారా భారీగా ఆయుధాలను పాక్‌కు పంపించారన్న ప్రచారం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలను చైనా అధికారికంగా ఖండించింది.

చైనా మిలటరీ అధికారిక ప్రకటన

చైనా మిలటరీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, పాక్‌కు ఆయుధాల సరఫరా జరగలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా చైనాపై అవాస్తవ ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ, అలాంటి తప్పుడు సమాచారం పంచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారత్‌తో ఉన్న సంబంధాల్లో చైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది.

అదంతా ఫేక్ ప్రచారం

అయితే వాస్తవంగా పాకిస్తాన్ తన ఆయుధ అవసరాల్లో మూడొంతులను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో పలు యుద్ధ సామగ్రిని, యుద్ధ విమానాలను చైనా పాకిస్తాన్‌కు అందించింది. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండానే వదంతులుగా మారాయని చైనా స్పష్టం చేసింది. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇలాంటి వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also : Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ విజయం.. బీజేపీ తిరంగా యాత్ర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ

పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ

గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు

గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు

నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

తమిళనాడులో ఎన్నికల నగారా..23న పోలింగ్

తమిళనాడులో ఎన్నికల నగారా..23న పోలింగ్

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

📢 For Advertisement Booking: 98481 12870