లోక్‌సభ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు..విపక్షాలు వాకౌట్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ‘నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025′ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్‌ను నిర్మల కోరారు. అనంతరం విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో లోక్‌సభ సమావేశాలను మార్చి 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు, వక్ఫ్ సవరణ బిల్లుపై తాము రూపొందించిన నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

2026 సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం..
నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025’ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం వల్ల, 60 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ‘ఆదాయపు పన్ను చట్టం-1961’ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ముందడుగు పడింది. నూతన చట్టాన్ని ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అని పిలువనున్నారు. దీన్ని 2026 సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. పన్ను చట్టాలను ప్రతీ ఒక్కరు సులభంగా చదివి, అర్థం చేసుకులా సరళమైన భాషలో నూతన ఆదాయపు పన్ను బిల్లుకు రూపకల్పన చేశారు.
చట్ట సమీక్షకు 22 ప్రత్యేక సబ్ కమిటీలు..
ఈ చట్టాన్ని సమీక్షించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. చట్ట సమీక్షకు 22 ప్రత్యేక సబ్ కమిటీలనూ ఏర్పాటు చేశారు. మొత్తం మీద కొత్త చట్టం సమీక్ష నిమిత్తం 6500 సలహాలను ఆదాయ పన్ను విభాగం అందుకుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, కొత్త బిల్లు తీసుకొచ్చారు.