నేపాల్‌లో మళ్లీ భూమి కంపించింది.రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.గర్ఖాకోట్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో, 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.ఈ రోజు సాయంత్రం 7.52 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.ఈ ప్రకంపనలు ఉత్తర భారత దేశానికీ ప్రభావం చూపాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది.అక్కడి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే ఇప్పటివరకు ఎక్కడా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.నేపాల్‌లో జరిగిన ఈ భూకంపానికి వారం రోజుల ముందు, మయన్మార్‌లో భయంకరమైన భూకంపం చోటుచేసుకుంది.రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన ఆ ప్రకృతి విపత్తు వేలాది ప్రాణాలు బలిగొంది. దాదాపు 3,000 మందికి పైగా మృతి చెందగా, 4,500 మందికి పైగా గాయాలపాలయ్యారు. అంతేకాకుండా, మరో 341 మంది కనిపించకుండా పోయారు.ఈ తరహా భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా భూగర్భ మార్పులు పెరుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. నిపుణులు భూకంప భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.