हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Narendra Modi: ఏపీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఎప్పుడంటే ?

Sharanya
Narendra Modi: ఏపీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఎప్పుడంటే ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ వేడుకను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే థీమ్‌తో ‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

‘యోగాంధ్ర 2025’

చంద్రబాబు ప్రణాళిక ప్రకారం, రాష్ట్రాన్ని యోగా ప్రాచుర్యంలో ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు “యోగాంధ్ర 2025” అనే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగా మంత్‌’ పాటించాలని సీఎం ఆదేశించారు. ఈ ఒక్క నెల కాలంలో ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో యోగా అంశంపై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.

ప్రధాని పర్యటన కోసం ఐదుగురు మంత్రులతో కమిటీ

జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమం విశాఖపట్నంలో జరుగనుంది. ప్రధానిగా మోడీ సైతం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హోం, ఆరోగ్య, పర్యాటక, మానవ వనరులు, మరియు సామాజిక సంక్షేమ శాఖల మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును నియమించారు. ఏపీని ఆధునిక ప్రదేశ్‌, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. యువత కలలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్య స్థానంగా మారుతుందని కొనియాడారు.

అమరావతిలో మోడీ పునఃనిర్మాణ సందేశం

ఇటీవ‌లే అమరావతిలో జరిగిన పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు మోడీ. పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అని ప్రధాని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌కు ఇది శుభ సంకేతమని చెప్పారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ పర్యటనతో రాష్ట్రానికి పలు రంగాల్లో వృద్ధికి గట్టిపునాది పడనుందని ఆశలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కేంద్ర సహకారం వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతి నిర్మాణానికి ఇచ్చే మద్దతు పునఃనిర్మాణ వేగాన్ని పెంచే సూచనలు ఉన్నాయి.

Read also: Krishna District: పేకాట ముఠాపై పోలీసుల దాడి.. తప్పించుకునే క్రమంలో కృష్ణానదిలో దూకి వ్యక్తి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870