Nalgonda Municipal Corporation : నల్గొండను మునిసిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించిన సందర్భంగా నల్గొండ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ హయాంలో నల్గొండను “సూపర్ స్మార్ట్ సిటీ”గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కార్పొరేషన్ హోదా రావడంతో కేంద్ర ప్రభుత్వంనుంచి నేరుగా నిధులు పొందే అవకాశం లభించిందని పేర్కొన్నారు. కేవలం 25 నెలల్లోనే కార్పొరేషన్ హోదాను సాధించడం గొప్ప విజయమని, గతంతో పోలిస్తే అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని తెలిపారు.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
నల్గొండలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, రూ.700 కోట్లతో ఓఆర్‌ఆర్ నిర్మాణం, ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్డు, బ్రహ్మగారి గుట్ట–లతీఫ్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి–అనంతారం రోడ్లు, ఎస్ఎల్‌బీసీ (Nalgonda Municipal Corporation) పూర్తి చేయడం, ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా నల్గొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని, శాంతి, సమరస్య వాతావరణంలో కార్పొరేషన్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: