हिन्दी | Epaper

Vangalapudi Anitha: జగన్‌పై మంత్రి అనిత సెటైర్

Sudheer
Vangalapudi Anitha: జగన్‌పై మంత్రి అనిత సెటైర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, అసలు కల్తీ జరిగిన సమయంలో బాధ్యులైన వారిని వదిలేసి, సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని, ఇందాపూర్ కేవలం పాలు మరియు ఇతర ఉత్పత్తులను బల్క్ మార్కెటింగ్ చేసే సంస్థ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. హెరిటేజ్ ఎప్పుడూ ట్యాంకర్ల ద్వారా ఇతర కంపెనీలకు బల్క్ నెయ్యిని సరఫరా చేయదని, ఈ చిన్న విషయాన్ని కూడా జగన్ వక్రీకరిస్తున్నారని అనిత ఎద్దేవా చేశారు.

IFR Milan 2026 : విశాఖలో అంతర్జాతీయ పరేడ్ వైభవం, ప్రపంచం చూపు ఇక్కడే!

నెయ్యి ధరల పెరుగుదలపై జగన్ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 2015తో పోలిస్తే ఇప్పుడు ధరలు పెరగడం సహజమని, దానికి సాక్షి పేపర్, భారతీ సిమెంట్ ధరల పెరుగుదలే నిదర్శనమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాల ధర పెరిగినప్పుడు నెయ్యి ధర పెరగదా అని ప్రశ్నిస్తూ, “పాలు లేకుండా నెయ్యి తయారు చేసే టెక్నాలజీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉందేమో” అని చురకలు అంటించారు. నెయ్యి కల్తీకి సంబంధించి ఎన్డీబీ రిపోర్టులు స్పష్టంగా ఉన్నాయని, జగన్ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే నిబంధనలను నీరుగార్చి, తమకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చారని ఆమె ఆరోపించారు. టర్నోవర్ నిబంధనలను తగ్గించి, పాలు సేకరించని కంపెనీలకు కూడా టెండర్లు ఇవ్వడం వెనుక ఉన్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, ధైర్యముంటే కల్తీపై నేరుగా చర్చకు రావాలని జగన్‌కు ఆమె సవాల్ విసిరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!

మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!

బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

📢 For Advertisement Booking: 98481 12870