हिन्दी | Epaper

మన్మోహన్ సింగ్‌‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

sumalatha chinthakayala
మన్మోహన్ సింగ్‌‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

హైదరాబాద్‌: భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపేందుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్‌ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్‌ సింగ్‌ చేసిన సేవలను సీఎం రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల రూపకల్పి మన్మోహన్‌ సింగ్‌ అని కొనియాడారు. దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని రేవంత్‌ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి విశిష్ట సేవలందించారు. ప్రధానిగా పదేళ్లు అద్భుతమైన పాలన అందించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్‌ ఆత్మబంధువు. తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిది. రాష్ట్రహోదా కల్పించిన మానవతావాది. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్‌ స్థానం శాశ్వతం. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ దశ దిశను మార్చింది. మన్మోహన్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేటికి పాటిస్తున్నాం. నేడు దివంగత ప్రధానికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇదివరకే మన్మోహన్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి అమలు చేస్తోంది. సంతాప దినాలలోనే మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపి, శాసనసభ వేదికగా ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

📢 For Advertisement Booking: 98481 12870