हिन्दी | Epaper

Miyapur : మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం..కానిస్టేబుల్‌ మృతి

sumalatha chinthakayala
Miyapur : మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం..కానిస్టేబుల్‌ మృతి

Miyapur : మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్‌ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు. నో ఎంట్రీ వాహనాలను నియంత్రిస్తున్నారు. అదే సమయంలో కూకట్‌పల్లి భరత్ నగర్‌లో బియ్యం బస్తాలను అన్‌లోడ్ చేసిన ఓ లారీ.. మియాపూర్ వైపు అతివేగంగా వచ్చి ట్రాఫిక్ బూత్‌ను ఢీకొట్టింది. దీంతో అది అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పడింది.

మెట్రో స్టేషన్‌ వద్ద లారీ

నిర్లక్ష్యం, అతి అతివేగం వల్లే ప్రమాదం

హోంగార్డు సింహాచలం తలకు తీవ్రమైన గాయం కాగా, రాజవర్ధన్ కుడి చెయ్యి భుజంలో ఫ్రాక్చర్ అయింది. విజేందర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులను వైద్యం నిమిత్తం మదీనాగూడలోని ఓ ప్రైవేటు దవాఖానకు హాస్పటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. మిగిలిన ఇద్దరూ గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. లారీ డ్రైవర్‌ను సదాశివపేటకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. నిర్లక్ష్యం, అతి అతివేగం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. మృతుడు సింహాచలం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అని చెప్పారు. ప్రస్తుతం, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

📢 For Advertisement Booking: 98481 12870