हिन्दी | Epaper

Kakani Govardhan Reddy : సిట్ కస్టడీకి కాకాణి

Sudheer
Kakani Govardhan Reddy : సిట్ కస్టడీకి కాకాణి

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గ్రావెల్ అక్రమ రవాణా కేసు (Gravel smuggling case) లో కీలక నిందితుడిగా పేర్కొన్న ఆయనను తాజాగా సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న కాకాణిని వైద్య పరీక్షల అనంతరం కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయనను సిట్ విచారించనుంది.

రెండు రోజులపాటు విచారణ

ఈ రోజు (జూన్ 25) నుంచి రేపటివరకు రెండు రోజుల పాటు సిట్ అధికారులు కాకాణిని విచారించనున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలు, కాంట్రాక్టులు, సంబంధిత వ్యక్తుల వివరాలు, అలాగే ఎలాంటి అధికార బద్నాముకు పాల్పడ్డారా అనే కోణాల్లో అధికారుల ప్రశ్నలు సాగనున్నాయి. కేసు విచారణలో కీలక మలుపుగా ఈ కస్టడీ మారే అవకాశం కనిపిస్తోంది.

ఫోర్జరీ ఆరోపణలపై విచారణ

ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి A2 నిందితుడిగా ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులును లక్ష్యంగా చేసుకుని ఫోర్జరీ సంతకాలు చేసి వివిధ డాక్యుమెంట్లను తయారు చేసినట్లు కేసు నమోదు అయింది. ఇప్పటికే ఈ కేసులో పలు మలుపులు తిరుగుతున్న తరుణంలో, కాకాణి కస్టడీ విచారణతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాల కోసమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also : Chevireddy Mohit Reddy: సిట్ విచారణకు హాజరుకాని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📢 For Advertisement Booking: 98481 12870