గత మూడేళ్లుగా రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ (Ukraine) భద్రతను కాపాడటానికి యూరప్ ప్రధాన బాధ్యతను తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) తెలిపారు. భౌగోళికంగా దగ్గరగా ఉండటంతో పాటు ప్రత్యక్ష భద్ర(European countries) పై ఉందని నొక్కి చెప్పారు. ఉక్రెయిన్ గడ్డపైకి తమ సైన్యాన్ని పంపేది లేదని ట్రంప్ స్పష్టం చేసినట్లు ప్రకటించిన కొద్ది సేపటికే, జేడీ వాన్స్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు
ప్రధాన బాధ్యత యూరప్దే :జేడీ వాన్స్
‘యుద్దం ముగించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి అమెరికా సిద్ధంగా ఉంది. కానీ యుద్ధానంతరం ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం చేయడం, భద్రతా హామీలను ఇవ్వడం యూరప్ దేశాలపై ఉంది. ఈ భారం మేం మోయాలని అనుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించి, ప్రాణ నష్టాన్ని ఆపడానికి అవసరమైతే మేం సహాయం చేస్తాం. కానీ ప్రధాన బాధ్యత యూరప్దే. అధ్యక్షుడు కూడా స్పష్టంగా చెప్పినట్లే యూరప్ ముందడుగు వేయాలి. అమెరికా చర్చలకు సిద్ధంగా ఉంది కానీ యుద్ధాన్ని ఆపడానికి అవసరమైన అంశాలు స్పష్టమయ్యే వరకు ఎలాంటి నిబద్ధతలను చేయదు.

ఉక్రెయిన్ కు అమెరికా సైన్యాన్ని పంపం
ఉక్రెయిన్ గడ్డపైకి అమెరికా సైన్యాన్ని పంపేది లేదని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కెరోలిన్ లీవిట్ వెల్లడించారు. అయితే గగనతలం సహా ఇతరత్రా ఆప్షన్లు మిగిలి ఉన్నాయని ఆమె తెలిపారు. ఉక్రెయిన్ భద్రత కోసం ఏవిధమైన సైనిక సహాయాన్ని అందించాలనే అంశం అమెరికా ప్రెసిడెంట్ పరిధిలో ఉందన్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు. ఐరోపాలోని మిత్రదేశాలను సమన్వయం చేసుకుంటూ, ఉక్రెయిన్‌కు తగిన భద్రతను కల్పిస్తామని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ భద్రతా విషయంలో యూరప్ దేశాలే బాధ్యత తీసుకోవాలని జేడీ వాన్స్ అన్నారు. ఇదిలా ఉండగా జులైలో ట్రంప్ సర్కార్ నాటోతో ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
ఉక్రెయిన్ ఎలా ప్రారంభమైంది?
వివిధ ఆధిపత్యాల కాలం తర్వాత, 1991లో సోవియట్ యూనియన్ రద్దుతో ఉక్రెయిన్ తన ఆధునిక స్వాతంత్ర్యాన్ని పొందింది. దీనికి ముందు, 1918-1920లో దీనికి స్వల్పకాలిక స్వాతంత్ర్యం ఉంది, కానీ ఆ తర్వాత ఉక్రేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌గా సోవియట్ యూనియన్‌లో విలీనం చేయబడింది.
ఉక్రెయిన్ రాజధాని మరియు కరెన్సీ ఏమిటి?
ఉక్రెయిన్ రాజధాని కైవ్, మరియు దాని కరెన్సీ ఉక్రేనియన్ హ్రైవ్నియా
Read hindi news: hindi.vaartha.com
Read Also: