हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

India 6G leadership : 6జీలో వరల్డ్ లీడర్స్ మనమే? సింథియా ధీమా!

Sai Kiran
India 6G leadership : 6జీలో వరల్డ్ లీడర్స్ మనమే? సింథియా ధీమా!

India 6G leadership : 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానం ఇస్తూ దేశంలో డిజిటల్ రంగం వేగవంతమైన పురోగతిని వివరించారు.

4జీ దశలో భారత్ ప్రపంచాన్ని అనుసరించిందని, 5జీలో ప్రపంచంతో సమానంగా నడిచిందని, ఇక 6జీలో ముందంజలో ఉంటామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్‌లో 5జీ సేవలు విస్తరించాయని చెప్పారు. కేవలం 22 నెలల్లోనే దేశంలోని 99.9 శాతం జిల్లాలకు 5జీ సేవలు చేరినట్లు వెల్లడించారు.

Read Also: Yash: ‘టాక్సిక్’ మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

India 6G leadership
India 6G leadership

5జీ విస్తరణ కోసం టెలికాం కంపెనీలు సుమారు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాయని, దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 40 కోట్ల మంది 5జీ సేవలు వినియోగిస్తున్నారని, 2030 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.

గత దశాబ్దంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 6 కోట్ల నుంచి 100 కోట్లకు పెరిగినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వై-ఫై విస్తరణతో డిజిటల్ కనెక్టివిటీ కొత్త దశలోకి ప్రవేశించిందన్నారు. ‘నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025’లో భారత్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 45వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ టెక్నాలజీని అనుసరించే దేశం నుంచి, డిజిటల్ రంగంలో నాయకత్వం వహించే దేశంగా మారిందని సింథియా వ్యాఖ్యానించారు. ఈ డిజిటల్ విప్లవం నగరాలకే కాకుండా గ్రామాల వరకూ విస్తరిస్తోందని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870