हिन्दी | Epaper

India – Pakistan War : హై టెన్షన్.. 11 చోట్ల కనిపించిన పాక్ డ్రోన్లు?

Sudheer
India – Pakistan War : హై టెన్షన్.. 11 చోట్ల కనిపించిన పాక్ డ్రోన్లు?

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ, పాకిస్తాన్ డ్రోన్లు భారత సరిహద్దు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కనిపించాయి. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం, మొత్తం 11 ప్రాంతాల్లో డ్రోన్లు గాలిలో విహరించినట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌ లోని సాంబ, కుప్వారా, ఉరి, నౌగామ్-హంద్వారా సెక్టార్‌తో పాటు పూంఛ్, జమ్మూ, పఠాన్ కోట్, రాజస్థాన్‌లోని పోఖ్రాన్, పంజాబ్‌లోని అమృత్ సర్, రాజౌరీ ప్రాంతాల్లో ఈ డ్రోన్లు కనిపించాయి.

అమృత్ సర్ సమీపంలో 4 పేలుళ్లు

ప్రత్యేకంగా అమృత్ సర్ సమీపంలో 4 పేలుళ్లు సంభవించాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇదే ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ పాక్ మిసైల్ దాడులకు ప్రయత్నించగా, భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. తాజా ఘటనలతో మళ్లీ అదే ప్రాంతం పాక్ లక్ష్యంగా మారినట్టుగా తెలుస్తోంది. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, నిఘా పరికరాలను పంపించే ప్రయత్నాలుగా అధికారులు భావిస్తున్నారు.

సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్

ఈ నేపథ్యంలో అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భారత త్రివిధ దళాలు, ఎయిర్ డిఫెన్స్ యంత్రాంగం, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల కదలికలను గుర్తించి తక్షణమే వాటిని కూల్చివేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద చట్టవిరుద్ధ చర్యలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also : BCCI : ఐపీఎల్ వాయిదా..టికెట్ల సొమ్మును వాపసు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870