हिन्दी | Epaper

Breaking News – Raj Tarun : హీరో రాజ్ తరుణ్ మరో కేసు

Sudheer
Breaking News – Raj Tarun : హీరో రాజ్ తరుణ్ మరో కేసు

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మరో కేసు నమోదైంది. తన మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 30న రాజ్ తరుణ్ తన అనుచరులతో కలిసి తమ కుటుంబసభ్యులపై దాడి చేశారని లావణ్య ఆరోపించారు. ఈ దాడిలో తమ ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారని, అలాగే తమ పెంపుడు కుక్కను కూడా చంపారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తండ్రికి గాయాలు

ఈ దాడి ఘటనలో తన తండ్రికి గాయాలయ్యాయని లావణ్య తెలిపారు. ఈ విషయం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాజ్ తరుణ్‌పై పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కొత్త కేసు ఆయన ఇమేజ్‌కు మరింత దెబ్బ తీసే అవకాశం ఉంది. కేసు నమోదు తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ అనుచరుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఇరువురి మధ్య గతంలో ఉన్న విభేదాలు, ఇప్పుడు ఈ దాడికి కారణమయ్యాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో, రాజ్ తరుణ్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కేసు టాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

https://vaartha.com/latest-news-sonakshi-sinha-sonakshi-sinhas-anger-over-e-commerce-sites/cinema/540773/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విధ్వంసం!

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

ఆస్కార్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం

ఆస్కార్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం

ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ సినిమా ఇదే

ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ సినిమా ఇదే

‘మధుబాల’గా సాయిపల్లవి?

‘మధుబాల’గా సాయిపల్లవి?

ఫౌజీ’మూవీ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే!!

ఫౌజీ’మూవీ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే!!

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

📢 For Advertisement Booking: 98481 12870