తెలంగాణలో వాతావరణం మారుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు (Rains) కురిసే అవకాశముందని పేర్కొంది. ముఖ్యంగా సిద్దిపేట, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు
వర్షాల ప్రభావం పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపించనుంది. ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) తాజా సమాచారం ప్రకారం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశమున్నప్పటికీ, వర్షాల మధ్య విద్యుత్ పిడుగులకూ అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాడెళ్లలో పని చేసే రైతులు, బయట ప్రయాణించే వారు వర్షాభావ పరిస్థితుల గురించి ముందస్తుగా తెలుసుకొని సురక్షితంగా ఉండాలి. విద్యుత్ తీగలు, నీటి నిల్వలు వంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికార యంత్రాంగం అవసరమైన స్థాయిలో సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
Read Also : KTR : రేపు ఉదయం ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్