బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) స్పందించారు. గతంలో చోటు చేసుకున్న మేజర్ తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా, అంటూ ప్రశ్నించారు.
ఎవరూ బాధ్యత
‘ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట. కుంభమేళాలో తొక్కిసలాట. బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవంలో తొక్కిసలాట. ఆయా ఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. రాజీనామాలూ లేవు. జవాబుదారీతనం లేదు. పాఠాలూ నేర్చుకోలేదు. భారతదేశంలో సామాన్యుడి జీవితం అమూల్యమైనది కాదా, విలువలేదా, వారి ప్రాణం విలువ ఒక కప్పు చాయ్ కంటే చౌకగా మారింది, ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగా సాగుతోంది. ఏమీ మారట్లేదు’ అంటూ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏర్పాటు చేసిన
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం, నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర విషాదాంతమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు.
గోయెంకా ఆవేదన
“మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా? అంత విలువ లేదా? వారి ప్రాణం విలువ ఒక కప్ ఛాయ్ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటోంది. ఏమీ మారట్లేదు” అంటూ గోయెంకా ఆవేదన వ్యక్తం చేశారు.

బాధ్యతగా వ్యవహరించాల్సిన
హర్ష్ గోయెంకా చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది చాలా దురదృష్టకర ఘటన. నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అయితే, అంతకంటే ముందు సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది” అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు సామాన్యుల భద్రతపై ప్రభుత్వాలు, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అభిప్రాయపడ్డారు.
Read Also: Bengaluru Stampede:మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం సిద్దరామయ్య