हिन्दी | Epaper

15 నుంచి ఒంటిపూట బడులు.. ప్రభుత్వం ఉత్తర్వులు

sumalatha chinthakayala
15 నుంచి ఒంటిపూట బడులు.. ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. ఆ తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని చెప్పింది.

15 నుంచి ఒంటిపూట బడులు

ఏప్రిల్‌ 24 నుంచి సెలవులు

ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్‌, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలకు హాఫ్‌ డే ఉంటుందని.. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగే పాఠశాల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను తెలియజేయడంతో పాటు అమలును స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్ట్‌ ఆదేశించారు. కాగా, సెలవుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్‌ 24 నుంచి సెలవులు ప్రకటించి.. తిరిగి జూన్‌ 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ఇంటర్ ఫలితాలు ఎప్పుడు?

ఇంటర్ ఫలితాలు ఎప్పుడు?

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

📢 For Advertisement Booking: 98481 12870