हिन्दी | Epaper

Breaking News – Onion : ఫ్రీ అనగానే క్షణాల్లో ఉల్లి మాయం

Sudheer
Breaking News – Onion : ఫ్రీ అనగానే క్షణాల్లో ఉల్లి మాయం

కర్నూలు (Kurnool ) వ్యవసాయ మార్కెట్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు ఉచితమని వినగానే బండెనక బండి కట్టి ఉల్లి (Onion) బస్తాలను ఎత్తుకెళ్లడం పరిస్థితిని మరింత విషాదకరంగా మార్చింది. బైక్‌లు, ఆటోలు, సైకిళ్లు లేకపోతే నడుచుకుంటూ మరీ ప్రజలు మార్కెట్ వద్దకు చేరి అందినకాడికి ఉల్లి బస్తాలను తీసుకెళ్లారు. ఒకరు మొదలుపెట్టగానే ‘ముందుకు పదండి’ అన్నట్లుగా మరికొందరు కూడా తరలిపోయి పెద్ద ఎత్తున బస్తాలను దోచుకెళ్లడం అక్కడి పరిస్థితిని అదుపులో పెట్టలేనిదిగా మార్చింది.

Onion: తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుంది

గత కొద్దికాలంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లిపాయలు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. అయితే రేట్లు పతనం కావడంతో వ్యాపారులు తక్కువ ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్వింటా ఉల్లిని రూ.1200 చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లకు తరలించి అమ్మకాలు నిర్వహిస్తోంది. అయితే మిగిలిపోయిన ఉల్లిని బహిరంగ వేలంలో విక్రయించినా ధరలు క్వింటాకు రూ.50 వరకు పడిపోయాయి. దీనివల్ల రైతులు మరింత నష్టపోగా, మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు నిల్వ అయ్యిపోవడం మొదలైంది.

ఈ నిల్వ ఉల్లిని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారన్న వార్తలు బయటపడగానే కర్నూలు ప్రజలు ఆగ్రహంతో మార్కెట్‌కు చేరుకుని, ఉల్లిపాయ బస్తాలను ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. కొద్ది సేపట్లోనే ట్రక్కులు, ఆటోలు, బైకులు నిండా ఉల్లిపాయలతో తరలిపోయాయి. అధికారులు, పోలీసులు చేరుకునేసరికి ఎక్కువ భాగం బస్తాలు మాయం అయ్యాయి. మార్కెట్ అధికారులు “డంపింగ్ యార్డుకు తరలిస్తోన్న ఉల్లిని ప్రజలు అపోహతో దోచుకెళ్లారు” అని వివరణ ఇచ్చినా, రైతుల కష్టపడి పండించిన పంట ఇలా విలువలేని స్థితికి చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సంఘటన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

https://vaartha.com/rajnath-singh-defense-minister-at-telangana-liberation-day-celebrations/telangana/549274/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

టీ20 వరల్డ్ కప్ బహిష్కరణ వివాదం, కోచ్ సలావుద్దీన్ ఫైర్

టీ20 వరల్డ్ కప్ బహిష్కరణ వివాదం, కోచ్ సలావుద్దీన్ ఫైర్

ఏఐ దెబ్బకు ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

ఏఐ దెబ్బకు ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

పెన్షన్ల తొలగింపు పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ

పెన్షన్ల తొలగింపు పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ

ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

ఢిల్లీ AI సదస్సులో 8 ఏళ్ల బాలుడి ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది

ఢిల్లీ AI సదస్సులో 8 ఏళ్ల బాలుడి ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

ఈరోజు నుండే సూపర్-8 సమరం

ఈరోజు నుండే సూపర్-8 సమరం

వెనక్కి తగ్గేది లేదంటున్న ట్రంప్

వెనక్కి తగ్గేది లేదంటున్న ట్రంప్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870