తూర్పుగోదావరి జిల్లా : జిల్లాలోని(East Godavari) ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పిల్లల సంరక్షణ, భద్రత విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలంటూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నగరంలోని ఒక వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(Deputy Collector) నేతృత్వంలో సమగ్ర విచారణ చేపట్టగా, విచారణలో హాస్టల్ సంక్షేమ అధికారి ఉమా దేవి విధుల్లో నిరక్ష ప్రదర్శించినట్లు నిర్ధారణ కావడంతో, ఆమెను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ వసతి గృహాల పిల్లల భద్రత, రక్షణ అంశాల్లో ఎవరైనా నిరక్ష్యంగా వ్యవహరించినా, కఠినచర్యలు తప్పవు అని హెచ్చరించారు.
Read also: టీచర్లకు ‘టెట్’ రెండు రోజుల్లో నోటిఫికేషన్

ప్రతి వార్డెన్ భద్రతా బాధ్యతను నెరవేర్చాలని కలెక్టర్ హెచ్చరిక
ప్రతి వసతి గృహ వార్డెన్ తమ పరిధిలోని పిల్లల(East Godavari) సంరక్షణలో సంపూర్ణ బాధ్యత వహించాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని, భద్రత పరమైన చర్యలు పాటించాలి,” అని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వసతి గృహాల నుండి పిల్లలను పంపించే ముందు, వారి బంధువుల వివరాలు, గుర్తింపు ఆధారాలు పూర్తిగా నమోదు చేయడం తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. భద్రతా చర్యలు పాటించడంలో ఏ చిన్న లోపమూ చోటు చేసుకోరాదని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని సంబంధిత అధికారులు, సిబ్బంది ఈ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని, వసతి గృహాల్లో పిల్లల భద్రతకు సంబంధించి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :