हिन्दी | Epaper
మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Medaram Jatara : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ..బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు

Sudheer
Medaram Jatara : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ..బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల తిరుగు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా బస్టాండ్ ప్రాంగణానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రయాణికుల రద్దీని తట్టుకోలేక యంత్రాంగం చేతులెత్తేసింది. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోయారు.

Telangana: కేసీఆర్ తో KTR భేటీ

ముఖ్యంగా ప్రధాన మార్గమైన హన్మకొండ వైపు వెళ్లే కౌంటర్ల వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గంట నుంచి ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడంతో వేచి చూసి విసిగిపోయిన భక్తుల సహనం నశించింది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆగ్రహించిన ప్రయాణికులు కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన తడకలను పీకేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ఉన్న జనసందోహాన్ని నియంత్రించడంలో అటు పోలీసులు, ఇటు రవాణా శాఖాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

The rush of devotees continues on the third day in Medaram

అయితే, ప్రయాణికుల సంఖ్య అంచనాలకు మించి ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు సమర్థించుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా బస్సులు తిరిగి మేడారం చేరుకోవడంలో ఆలస్యం జరుగుతోందని, తక్షణమే అదనపు బస్సులను మళ్లించి భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో, అధికారులు పరిస్థితిని సమీక్షించి అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870