हिन्दी | Epaper

Bjp Leader: పాట్నాలో బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య

Shobha Rani
Bjp Leader: పాట్నాలో బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య

ఆరేళ్ల క్రితం కొడుకు.. ఇప్పుడు తండ్రి.. సేమ్‌ టూ సేమ్.. దుండగుల కాల్పులకు బలయ్యారు. బిహార్‌లో పాట్నాలో జరిగిన కాల్పుల సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ నేత(Bjp Leader), పారిశ్రామిక వేత్త గోపాల్‌ ఖేమ్కాను శుక్రవారం అర్థరాత్రి దుండగుడు కాల్చిచంపాడు.. కాల్పుల అనంతరం దుండగుడు బైక్‌పై పారిపోయాడు.. గుర్తుతెలియని దుండగుడు.. ఖేమ్కా (Khemka)ఇంటి పక్కనే ఉన్న హోటల్‌ ముందు ఉండగా.. కాల్పులు జరిపాడని.. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి.. ఖేమ్కా ఇంటికి వెళ్తుండగా గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ‘పనాచే’ హోటల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
శోకంలో బీహార్: మరోసారి ఖేమ్కా కుటుంబం లక్ష్యంగా..
ఖేమ్కా హోటల్ పక్కనే ఉన్న ‘ట్విన్ టవర్’ సొసైటీలో నివసిస్తున్నారు.. అతను తన నివాసానికి దగ్గరగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్ దగ్గర తన కారు దిగగానే నిందితుడు అతనిపై కాల్పులు జరిపి వెంటనే పారిపోయాడు. దీంతో గోపాల్ ఖేమ్కా (Bjp Leader) అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని పురాతన ప్రైవేట్ ఆసుపత్రులలో ఒకటైన మగధ్ ఆసుపత్రికి ఖేమ్కా యజమాని.. నేరస్థలం నుండి పోలీసులు ఒక బుల్లెట్, షెల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. గోపాల్‌ ఖేమ్కా మృతిపై బీహార్ ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది.. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Bjp Leader: పాట్నాలో బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య
పాట్నాలో బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య

ఘటన వివరాలు
“జూలై 4 రాత్రి 11 గంటల ప్రాంతంలో, గాంధీ మైదాన్ దక్షిణ ప్రాంతంలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా (Bjp Leader)కాల్చి చంపబడ్డారని మాకు సమాచారం అందింది… నేరస్థలానికి చేరుకుని పరిశీలించాం.. భద్రతను కట్టుదిట్టం చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది… ఒక బుల్లెట్ మరియు ఒక షెల్ స్వాధీనం చేసుకున్నారు…” అని సిటీ ఎస్పీ సెంట్రల్కి తెలిపారు. వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్య కేసుపై బీహార్ పోలీసులు ఒక సిట్‌ (Sit)ను ఏర్పాటు చేశారని, ఈ సిట్‌కు ఎస్పీ సిటీ సెంట్రల్ నేతృత్వం వహిస్తారని డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు.
ఖేమ్కా కుటుంబంపై వరుస దాడులు
బిహార్‌లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో .. బీజేపీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోపాల్‌ ఖేమ్కా దారుణ హత్య రాజకీయ దుమారం రేపుతోంది. అయితే.. గోపాల్‌ ఖేమ్కా కుమారుడు గుంజన్‌ కూడా ఆరేళ్ల క్రితం ఇదేవిధంగా హత్యకు గురయ్యాడు. 2018లో వైశాలి ప్రాంతంలోని తన ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుండగా గుంజన్‌ను బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. అప్పుడు కొడుకు.. ఇప్పుడు తండ్రి దుండగుల కాల్పులకు బలవ్వడం సంచలనంగా మారింది.
రాజకీయ స్పందన, భద్రతా చర్చలు
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ హత్య రాజకీయ దుమారానికి కారణమవుతోంది. బీజేపీ నేతలు ఈ హత్యను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలపై వరుస దాడులపై వాణిజ్య సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

 Read hindi news: hindi.vaartha.com

Read Also: Ranya Rao: కన్నడ నటికి ఈడీ ఝలక్ – రూ.34 కోట్ల ఆస్తులు జప్తు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870