SHG Telangana : రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను విస్తృతంగా అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఒక్కరోజే రూ.5,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.26,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి, ఒక కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేయాలన్న లక్ష్యాన్ని మించి అమలు చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయని ఆయన గుర్తు చేశారు.
అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకు ఆర్టీసీకి ప్రభుత్వం తరఫున రూ.7,000 కోట్లు చెల్లించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను ఆర్థిక భారం ఉన్నా కూడా ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు.
Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?
ఆహార భద్రతలో భాగంగా రాష్ట్రంలోని 1.15 కోట్ల (SHG Telangana) కుటుంబాల్లో 96 లక్షల కుటుంబాలకు వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్‌లో కిలో బియ్యం ధర రూ.55 ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోందన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణవ్యాప్తంగా 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు.

నీటిపారుదల విషయానికి వస్తే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాలో 2.79 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాయని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రూ.126 కోట్ల వ్యయంతో చేపట్టిన మున్నేరు–పాలేరు లింక్ ప్రాజెక్ట్ ద్వారా 1.38 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 33,025 ఎకరాలు, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2,500 ఎకరాలు, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2,412 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు వివరించారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చెక్‌డ్యామ్‌లు, అనుబంధ నిర్మాణాలు చేపట్టి నీటి వృథాను అరికట్టి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: