Bandi Sanjay : ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని చెప్పారు. పహల్గాం ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి అంగీకరించారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా నిలవాలన్నారు.

ఈ చర్యలు పాకిస్తాన్ కు గట్టి సందేశాన్ని ఇస్తాయి
ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ చర్యలు పాకిస్తాన్ కు గట్టి సందేశాన్ని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
10 లక్షల ఉద్యోగాలను భర్తీ
ఇక, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’ 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోడీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామనిబండి సంజయ్ తెలిపారు.