ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ (Exam)లకు సంబంధించిన ప్రాథమిక కీ మరియు రీస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన కీలు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తన రీస్పాన్స్ షీట్‌ను చూసుకోవచ్చు.
అభ్యంతరాల నమోదుకు చివరి తేదీ జులై 11
ప్రాథమిక కీపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే, తగిన ఆధారాలను జతచేసి జులై 11 లోపు మాత్రమే ఆన్‌లైన్‌లో https://apdsc.apcfss.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి. ఇతర మార్గాల్లో పంపిన అభ్యంతరాలు పరిగణించబోమని కన్వీనర్ స్పష్టం చేశారు. ఇది పరీక్షా పారదర్శకతను మెరుగుపరిచే దిశగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంగా పేర్కొనవచ్చు.
జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షల కీ త్వరలోనే
జూన్ 29 నుండి జూలై 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ, రీస్పాన్స్ షీట్లు కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు. మొత్తం ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి తుది కీ విడుదల చేసిన వెంటనే ఫలితాలను ప్రకటించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.
Read Also : Mallikarjuna Kharge : కాంగ్రెస్ అసంతృప్త నేతలతో ఖర్గే భేటీ