हिन्दी | Epaper

నేడు హర్యానాలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు

sumalatha chinthakayala
నేడు హర్యానాలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి : : ఏపీ సీఎం చంద్రబాబు హర్యానాలో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హజరుకానున్నారు. కాసేపట్లో విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి..11 గంటలకు చంద్రబాబు చంఢీఘర్ చేరుకుంటారు. 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచకుల, సెక్టార్ 5లోని దసరా గ్రౌండ్‌కు సీఎం చంద్రబాబు వెళతారు. అక్కడ నయాబ్ సింగ్ సెనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ నిర్వహించే మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వస్తారు. కాగా హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయాన్ని సాధించిన BJP కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మొత్తం 90 సీట్లలో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ప్రకటించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870