हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్

sumalatha chinthakayala
పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్

అమరావతి: టాలీవుడ్ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళి పై కేసు నమోదైంది. దాంతో నరసరావుపేట టూ టౌన్ పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు. తాజా కేసులో భాగంగా పీటీ వారెంట్ పై పోసానిని నరసరావుపేటకు తరలించే యత్నాలు మొదలయ్యాయి. నరసరావుపేట సిఐ హైమారావు, సిబ్బంది రాజంపేట సబ్ జైలుకు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్

నరసరావుపేట పీఎస్‌లో మరో కేసు నమోదు

ప్రస్తుతం పోసాని రాజంపేటలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై నరసరావు పేట పోలీసులు 153-ఎ, 504, 67 ఐటీ కింద తాజాగా కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసరావుపేటకు పోసానిని తరలించి, అక్కడ న్యాయస్థానం ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు కాగా ఆ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు ఆయనపై పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ఇప్పటివరకూ మూడు జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట సబ్ జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు.

ఒకేసారి మూడు జిల్లాల పోలీసుల నుంచి పీటీ వారెంట్లు

అనంతపురం రూరల్, గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా పోలీసులు పోసానికి సంబంధించి పీటీ వారెంట్లు రాజంపేట జైలుకు సమర్పించారు. పోసానిని తమ అదుపులోకి తీసుకునేందుకు నరసరావు పేట పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నామని చెబుతున్నారు. కనుక పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు విషయం తెలిపారు. ఒకేసారి మూడు జిల్లాల పోలీసుల నుంచి పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై సందిగ్దత నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870