ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో కొత్త ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. రూ.2,500 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్, అమరావతి(Amaravati)N13 రోడ్డును జాతీయ రహదారి NH-65తో కలపనుంది.
ప్రత్యేకమైన డిజైన్ – కూచిపూడి భంగిమ
ఈ వంతెన 5.22 కి.మీ పొడవునా రాయపూడి నుంచి మూలపాడు వరకు విస్తరించనుంది. కూచిపూడి నృత్య భంగిమను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. వంతెనకు ఎరుపు, తెలుపు రంగుల్లో రెండు పైలాన్లు ఉండగా, స్వస్తిక హస్త రూపంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రెండువైపులా కాలిబాటలు ఏర్పాటు చేయనున్నారు.
సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజలకు నాలుగు డిజైన్ నమూనాలను చూపించారు. దాదాపు 14 వేల మంది రెండో నమూనాకు ఓటు వేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే నమూనాను ఎంచుకున్నారు. దీనికోసం జపాన్‌కు చెందిన నిప్పన్ కోయి లిమిటెడ్ సంస్థ డీపీఆర్ సిద్ధం చేసింది.

రవాణా సౌకర్యాల మెరుగుదల
ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యాక, అమరావతికి చేరుకోవడానికి దాదాపు 35 కి.మీ దూరం తగ్గనుంది. అలాగే, సుమారు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఆరు వరుసల రహదారిగా డిజైన్ చేయబడిన ఈ వంతెన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడుతోంది.
గత ప్రాజెక్ట్ – కొత్త మార్పులు
2019లో టీడీపీ ప్రభుత్వం పవిత్ర సంగమం దిశగా ఎన్-10 రహదారి నుంచి రూ.1,387 కోట్లతో వంతెనకు శంకుస్థాపన చేసింది. అయితే తరువాతి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును(Project) నిలిపివేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థలాన్ని మార్చి, పశ్చిమ బైపాస్ ప్రణాళికతో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇది NH-65 ద్వారా అమరావతికి చేరుకునే వారికి అనుకూలంగా ఉండనుంది.
అమరావతిలో నిర్మించబోయే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ఖర్చు ఎంత?
సుమారు రూ.2,500 కోట్లు.
వంతెన పొడవు ఎంత ఉంటుంది?
మొత్తం 5.22 కి.మీ పొడవునా రాయపూడి నుంచి మూలపాడు వరకు ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: