ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసభ్య వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, కూటమి శ్రేణులు భగ్గుమన్నాయి. గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు 6 గంటలకుపైగా అందోళనకు దిగారు. ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు చెప్పులు, చీపుర్లతో నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలను బలంవంతంగా అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తత మధ్య అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Phone Tapping Case : ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తండ్రిపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలపై తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహించిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలంటూ అతని ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరులో ఉన్న నవభారతనగర్‌లోని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తండ్రిపై అంబటి అసభ్య వ్యాఖ్యలు చేశారు. మురికి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు, ప్రజలు ఆగ్రహించారు. అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ శ్రేణులు ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంట్లోని కిటికీ అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. ఇంటివద్ద ఉన్న అంబటి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన దిగారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని మాధవి డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com