हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

sumalatha chinthakayala
Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ 2025 ప్రారంభమైపోయింది. ఏప్రిల్ 14వ తేది నుంచి ఈ స్లాట్స్ ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు అమర్​నాథ్​కి వెళ్లి స్వయంభూని దర్శించుకోవాలనుకుంటే.. ఈ యాత్ర కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకీ అమర్​నాథ్​ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఏ ప్రక్రియను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్

వేసవికాలంలో అమర్​నాథ్ యాత్ర

వేసవికాలంలో అమర్​నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ తీర్థయాత్రను మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రారంభించి.. యాత్రకు వెసులుబాటు కల్పిస్తుంది. లక్షల్లో భక్తులు పాల్గొంటారు. దీనిలో భాగంగానే 2025కు గానూ.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను, ఎలా దరఖాస్తు చేయాలో చూసేద్దాం.

జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది

అమర్​నాథ్ యాత్రకు ఆన్​లైన్​, ఆఫ్​లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైపోయాయి. అమర్​నాథ్​ యాత్ర 2025లో జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది. మీరు ఇక్కడికి వెళ్లాలనుకుంటే.. అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ www.jksasb.nic.in ని సందర్శించాలి. సైట్​లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది.

మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు

మెడికల్ రిపోర్ట్ లేకుండా మీరు అమర్​నాథ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించదు. అలా అని మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు. SASB వెబ్‌సైట్‌లో ఏ ఆస్పత్రిలో ఏ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలో లిస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫిట్​గా ఉంటే వెంటనే అమర్​నాథ్ యాత్రకోసం రిజిస్టర్​ చేయించుకోండి. శివుని దర్శనం చేసేసుకోండి.

Read Also: మధ్యాహ్నం నుంచి మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870