రాజధాని అమరావతిలో (Amaravati) అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని నవులూరు వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (International Cricket Stadium) పనులు తుది దశకు చేరుకున్నాయి. స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయిందని ఏపీ మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
ఈ మేరకు స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాజధాని అమరావతిలో (Amaravati) నవులూరు వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని సిద్ధం చేస్తున్నాం అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ స్టేడియం 24 ఎకరాల విస్తీర్ణంలో, 34 వేల సీట్ల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతోంది. విజయవాడకు 13 కిలోమీటర్లు, గుంటూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, స్టేడియంను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: