జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో అమాయక పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన భారతదేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు సమాచారాన్ని సేకరించిన భారత ఇంటెలిజెన్స్, వెంటనే ప్రతిచర్యకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో “ఆపరేషన్ సిందూర్” పేరిట భారత బలగాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగాయి.
ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు – తొమ్మిది ప్రదేశాల్లో ఘాతుక దెబ్బలు
ఈ ఆపరేషన్‌లో భాగంగా పీఓకే ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు నూతన తరహా క్షిపణులు ప్రయోగించాయి. పీఓకేతో పాటు పాకిస్థాన్‌లోని తొమ్మిది కీలక ప్రాంతాల్లో చోటుచేసిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడుల తరువాత పాక్ మిలటరీ, ఐఎస్‌ఐ యంత్రాంగంలో తీవ్ర ఉలిక్కిపాటు చోటుచేసుకున్నది. భారత బలగాల కచ్చితమైన రీతిలో నిర్వహించిన దాడులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను తెచ్చుకున్నాయి.
భారత నగరాలపై మిస్సైల్, డ్రోన్ దాడులు
ఈ దెబ్బను తట్టుకోలేని పాకిస్థాన్, తక్షణమే వక్రబుద్ధితో ప్రతిచర్యకు దిగింది. దాదాపు 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, మిస్సైల్ దాడి చేసింది. అయితే, భారత ఆర్మీ ఆ డ్రోన్, మిస్సైల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్వీర్యం చేసింది. ఇక, పాక్‌కు బుద్ధి చెప్పడానికి రంగంలోకి దిగిన భారత నావికాదళం ఆ దేశానికి కీలకమైన కరాచీ పోర్టును పూర్తిగా నేలమట్టం చేసింది. కరాచీ పోర్టుతో పాటు పాక్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన పలు కేంద్రాలు, ఆయుధ నిల్వలు కూడా ధ్వంసమయ్యాయి. ఇది పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను గణనీయంగా బలహీనపరిచిన చర్యగా పేర్కొంటున్నారు.
“పాకిస్థాన్‌లో దీపావళి” – దోవల్ వీడియో వైరల్
ఈ దాడులకు సంబంధించిన వీడియోను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. “పాకిస్థాన్‌లో దీపావళి” అనే క్యాప్షన్‌తో ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. “ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది” అని ఒకరు, “భారత్‌తో పెట్టుకుంటే పాక్‌కు మిగిలేది బూడిదే” అని మరొకరు, “భారత్‌తో పెట్టుకుంటే మాములుగా ఉండదు దాయాది పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది” అని ఇంకొకరు కామెంట్ చేశారు.
Read also: Union Minister: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి భద్రత పెంపు ఎందుకంటే?