हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు : రామ్మోహన్ నాయుడు

sumalatha chinthakayala
ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు : రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: ఏపీలో అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు రాబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఏపీ ప్రజల తరపున నిర్మలమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని ఆలోచనగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని పేర్కొన్నారు. పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు.

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు. పన్ను చెల్లింపుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అలాగే, మధ్యతరగతి ప్రజలు రూ.12 లక్షలకు వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870