థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీ(International boxing tournament)లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది.ప్రత్యర్థులపై దీటైన పంచ్‌లు విసురుతూ తమన్నా, ప్రియ, దీపక్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన మహిళల 51కిలోల కేటగిరీ(Women’s 51kg category)లో తమన్నా, లియు యు షాన్(చైనీస్ తైపీ)పై అలవోకగా గెలిచింది.కాంస్య పతకాలను సాధించడమే కాక, ఈ టోర్నీలో భారత బాక్సింగ్ శక్తిని మరోసారి ప్రపంచానికి చాటుకున్నారు.

పవర్‌ఫుల్
57కిలోల విభాగంలో ప్రియ 5-0తో పార్క్ అహ్ హ్యున్(దక్షిణకొరియా)పై చిత్తుగా ఓడించింది. బౌట్‌లో ఆది నుంచే రెచ్చిపోయిన ప్రియ(Priya) ప్రత్యర్థిపై పవర్‌ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది. పురుషుల 75కిలోల బౌట్‌లో దీపక్ కిమ్ హ్యున్(కొరియా)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. మరోవైపు జుగ్ను(85కి), అంజలి(75కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Read Also: Athletics: అథ్లెటిక్స్ లో భారత్ పథకాల పంట