ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

బోయింగ్ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తుంది. నాలుగు గంటల తర్వాత అజర్బైజన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు తెలపడంతో వారు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి, తనిఖీలు చేపట్టింది. అది నకిలీ కాల్ అని తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి 322 మంది ప్రయాణికులున్నారు. తనిఖీల అనంతరం మంగళవారం తెల్లవారుజామున తిరిగి న్యూయార్క్ బయల్దేరనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

తాజాగా ఘటనతో ఆందోళన

గత డిసెంబర్ లో అజర్ బైజన్ ఎయిర్లైన్స్ కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్లో ని అక్టోలో అది కూలిపోయింది. రష్యా క్షిపణి తాకడం వల్ల విమానం కూలిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది.

తరచూ గా ఎయిరిండియా వార్తల్లో

ఇక ఇటీవల ఎయిరిండియా తరచూ వార్తల్లో నిలుస్తోంది. విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి వీల్బైర్ సదుపాయం కల్పించకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిన ఆమె కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాము బుక్ చేసుకున్నప్పటికీ.. ఎయిరిండియా సిబ్బంది ఛైర్ ఇవ్వలేదని ఆమె బంధువులు ఆరోపించారు. ఇక షికాగో నుంచి దిల్లీకి బయల్దేరిన విమానంలో టాయిలెట్లు మూసుకుపోవడంతో.. 10 గంటలు ప్రయాణం అనంతరం విమానం వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే

Related Posts
మధ్య ప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మధ్య ప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు.ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేపాయి. ప్రజలు ప్రభుత్వాన్ని అధికంగా ఆశ్రయిస్తున్నారని, ఇదొక చెడు అలవాటుగా మారిందని, Read more

భారత వాయు సేనలో అగ్నివీర్ ల నియామకాలు
army

భారత వాయుసేన నియామక ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా చేపట్టే ఈ నియామకం నాలుగేళ్లకు మాత్రమే పరిమితం. ఇంటర్, తత్సమాన కోర్సులు పూర్తిచేసిన అవివాహిత Read more

అంబానీకి 5 రోజుల్లోనే కోట్ల నష్టం
అంబానీకి 5 రోజుల్లోనే కోట్ల నష్టం

అంబానీ 5 రోజుల్లోనే రూ.91140 కోట్లు నష్టపోయారు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వారం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో Read more

అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురు స్వామి రాంపాల్ యాదవ్,అభి యాదవ్,రామ్ యాదవ్ పెద్ది యాదవ్ ల అద్వర్యం వెళ్తున్న అయ్యప్ప స్వాములు బస్సు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *