ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

బోయింగ్ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తుంది. నాలుగు గంటల తర్వాత అజర్బైజన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు తెలపడంతో వారు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి, తనిఖీలు చేపట్టింది. అది నకిలీ కాల్ అని తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి 322 మంది ప్రయాణికులున్నారు. తనిఖీల అనంతరం మంగళవారం తెల్లవారుజామున తిరిగి న్యూయార్క్ బయల్దేరనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

తాజాగా ఘటనతో ఆందోళన

గత డిసెంబర్ లో అజర్ బైజన్ ఎయిర్లైన్స్ కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్లో ని అక్టోలో అది కూలిపోయింది. రష్యా క్షిపణి తాకడం వల్ల విమానం కూలిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది.

తరచూ గా ఎయిరిండియా వార్తల్లో

ఇక ఇటీవల ఎయిరిండియా తరచూ వార్తల్లో నిలుస్తోంది. విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి వీల్బైర్ సదుపాయం కల్పించకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిన ఆమె కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తాము బుక్ చేసుకున్నప్పటికీ.. ఎయిరిండియా సిబ్బంది ఛైర్ ఇవ్వలేదని ఆమె బంధువులు ఆరోపించారు. ఇక షికాగో నుంచి దిల్లీకి బయల్దేరిన విమానంలో టాయిలెట్లు మూసుకుపోవడంతో.. 10 గంటలు ప్రయాణం అనంతరం విమానం వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే

Related Posts
రజనీ త్వరగా కోలుకోవాలి..రజనీకాంత్‌ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్‌
Rajini should recover soon.CM Stalin on Rajinikanth health

Rajini should recover soon..CM Stalin on Rajinikanth health న్యూఢిల్లీ: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో Read more

హర్యానాలో 1,500 కేజీ గేదె..?
buffalo

హర్యానాలోని ఒక గృహంలో ఒక గేదె అద్భుతమైన జీవితం గడుపుతోంది. ఈ గేదె పేరు అన్మోల్, ఇది ప్రత్యేకమైన డైట్ మరియు విలాసవంతమైన జీవనశైలితో జీవిస్తోంది. అన్మోల్ Read more

బస్సులో మహిళపై అత్యాచారం: నిందితుడి సమాచారం ఇస్తే రూ.1 లక్ష రివార్డు
MSRTC బస్సులో మహిళపై అత్యాచారం: నిందితుడి సమాచారం ఇస్తే రూ.1 లక్ష రివార్డు

మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనను రేపింది. MSRTC బస్సులో ఒక యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు దత్తాత్రే రాందాస్ గాడే Read more

బీహార్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య కుమ్ములాట..?
బీహార్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య కుమ్ములాట..?

బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య చీలిక వస్తుందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.బీహార్‌లోని ప్రతిపక్ష మహా కూటమిలోని రెండు ప్రధాన మిత్రదేశాలైన రాష్ట్రీయ జనతాదళ్ Read more