భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రోజు 1980, ఏప్రిల్ 6. దేశానికి ఒక కొత్త దిశను చూపించాలనే సంకల్పంతో శ్యామప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వానిల నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపించబడింది.అప్పుడు కేవలం ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది. ఎన్నో ఒడిదొడుకులు, రాజకీయ శత్రుత్వాలు ఎదుర్కొంటూ బీజేపీ పార్టీ ముందుకు సాగింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తల మద్దతుతో, లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని విజయపథంలో దూసుకెళ్తోంది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా బీజేపీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు
భారతీయ జనతా పార్టీ 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు పవన్ కల్యాణ్ . ఆయన బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఎన్డిఏ భాగస్వామిగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోంది.చారిత్రాత్మక ఉద్యమం ద్వారా బీజేపీ పార్టీ పుట్టింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్కే అద్వానీ లాంటి నేతలు ప్రజాస్వామ్య భారత్ కోసం పార్టీ స్థాపనకు కృషి చేశారు. దేశానికి సేవ చేయాలని ఆ మహనీయులు స్థాపించిన పార్టీఇప్పుడు కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తోంది.ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో మరిన్ని విజయాలను సాధించి, దేశాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలలోని “ఏక భారత, శ్రేష్ఠ భారత” సంకల్పాన్ని నిజం చేసేందుకు బీజేపీ నిత్యం ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.