బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు ఉదంతం కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. తనను చిక్కుల్లోంచి బయటపడేయాలంటూ సిద్ధరామయ్య సర్కార్‌లోని ఇద్దరు మంత్రులను ఆమె సంప్రదించినట్టు బీజేపీ ఆరోపించింది. ఇది తీవ్రమైన ప్రోటాకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల సపోర్ట్ లేకుండా రన్యారావు గోల్డ్ స్లిగింగ్ చేయగలిగి ఉండేది కాదని ఆయన అన్నారు. కాగా, బీజేపీ దాడిని అంతే వేగంగా కాంగ్రెస్ తిప్పికొట్టింది. బీజేపీ వైపు వేళ్లు చూపించింది. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బేజీపీ ప్రభుత్వంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డవల్‌మెంట్ బోర్డు రెన్యారావుకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2023లో భూమి కేటాయించిందని ఆరోపించింది.

రెన్యారావుకు బేజీపీ భూముల కేటాయింపు
కాగా, బీజేపీ దాడిని అంతే వేగంగా కాంగ్రెస్ తిప్పికొట్టింది. బీజేపీ వైపు వేళ్లు చూపించింది. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బేజీపీ ప్రభుత్వంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డవల్‌మెంట్ బోర్డు రెన్యారావుకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2023లో భూమి కేటాయించిందని ఆరోపించింది. రన్యారావు పట్టుబడగానే తనను సమస్య నుంచి బయటపడేయాంటూ కొందరు కాంగ్రెస్ మంత్రులను సంప్రదించే ప్రయత్నం చేశారని బీజేపీ నేత, ఎమ్మెల్యే భరత్ షెట్టి మీడియాకు తెలిపారు. ఇద్దరు మంత్రులు ఆమెకు సహకరిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు బయటకు వచ్చిందని, కేసును సీబీఐ చేపట్టడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.
సిద్ధరామయ్యకు ఇంటెలిజెన్స్ సమచారం
కాగా, రెన్యారావును చిక్కుల్లోంచి బయటపడేసేందుకు ఒక ప్రముఖ మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు తమకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయోంద్ర ఎడియూరప్పు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొ్న్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. గతంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్‌లు చాలానే జరిగి ఉండవచ్చని, పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయం లేకుండా రెన్యారావు రూ.12 కోట్ల బంగారం స్మగ్లింగ్ చేయగలిగి ఉండేది కాదని అన్నారు. మీడియాలో వస్తున్న కథనాలే నిజమైతే ఈ సంబంధాలు ఎంత లోతుగా ఉన్నాయన్నదే ప్రధాన ప్రశ్న అవుతుందన్నారు. అనుమానాస్పద మంత్రుల వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్యకు ఇంటెలిజెన్స్ సమాచారం అంది ఉండవచ్చని, వారిని కాపాండేకుకు ఎలాంటి ప్రయత్నం చేసినా అది బెడిసికొడుతుందని అన్నారు. ముఖ్యంగా సీబీఐ రంగంలోకి అడుగుపెట్టినందను నిజం బయటకు వస్తుందన్నారు.
హోంత్రి స్పందన
రన్యారావు పట్టుబడగానే ఇద్దరు రాష్ట్ర మంత్రులను సంప్రందించారంటూ విజయేంద్ర చేసిన ఆరోపణలపై రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర స్పందించారు. కేసు సీబీఐ చేతుల్లో ఉందని, దర్యాప్తులో ఏమి తేలుతుందో చూద్దామని అన్నారు. అప్పటి వరకూ ఎవరేమి మాట్లాడినా అవి ఊహాగానాలేనని చెప్పారు. రన్యారావుకు బీజేపీ హయాంలో భూమి కేటాయింపుపై అడిగినప్పుడు, ఆ విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ విషయం కూడా సీబీఐ విచారణలో తేలుతుందన్నారు.