భారత్, ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపనపై మంగళవారం అధికారికంగా ఒప్పందం మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సమక్షంలో హైదరాబాద్ హౌస్ లో జరిగింది. ఖతార్ అమీర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, ఈ పర్యటన భారత్-ఖతార్ బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరిపారు.

పత్రాల మార్పిడి – కీలక ఒప్పందాలు
ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఒప్పందాలను మార్చుకున్నారు. ఆదాయపు పన్నులకు సంబంధించి ద్వంద్వ పన్నుల ఎగవేత,ఆర్థిక మోసాలను నివారించే సవరించిన ఒప్పందం కూడా ప్రకటించారు. ఖతార్ ప్రధాని, భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య మరో కీలక ఒప్పంద మార్పిడి జరిగింది.
భారత్-ఖతార్ సంబంధాలలో కొత్త మైలురాయి
ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టం చేయనున్నాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలు రాబోయే కాలంలో కొత్త దిశలో ముందుకు సాగనున్నాయి. భారతదేశం,ఖతార్ మధ్య ఆదాయపు పన్నులకు సంబంధించి ద్వంద్వ పన్నుల ఎగవేత మరియు ఆర్థిక ఎగవేత నివారణకు సవరించిన ఒప్పందాన్ని కూడా మార్చుకున్నట్లు హైదరాబాద్ హౌస్‌లో జరిగిన వేడుకలో ప్రకటించారు.