నేడు తెలంగాణ ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. గత ఏడాది మెుదట మధ్యంతర బడ్జెట్ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ప్రభుత్వం నుంచి ఎన్నికల్లో ప్రకటించిన హామీల నుంచి అనేక ఇతర కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉదయం 11 గంటల నుంచి బడ్జెట్ మెుదలు అయింది. శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నేటి నూతన బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18,000 వేల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లను బడ్జెట్లో కేటాయించిన కాంగ్రెస్ సర్కార్ ఈసారి పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజే విద్యార్ధులందరికీ పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్ అందించాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్.

నూతన బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18,000 వేల కోట్లు
నూతన బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18,000 వేల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లను బడ్జెట్లో కేటాయించిన కాంగ్రెస్ సర్కార్. ఈసారి పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజే విద్యార్ధులందరికీ పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్ అందించాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్. కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్ కోసం రూ.47 కోట్లు కేటాయించిన తెలంగాణ సర్కార్. చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ప్లాన్ 2050 రూపొందించినట్లు పేర్కొన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. తాజా బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకి రూ.5,734 కోట్లను కేటాయించిన భట్టి విక్రమార్క. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి భట్టి.
ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు
ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటును ప్రకటించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని నలువైపులా శాటిలైట్ టౌన్‌షిప్ ప్రకటించిన భట్టి విక్రమార్క. తెలంగాణలోని గ్రామాల్లో 100 శాతం సోలార్ విద్యుత్ కాంతులను నింపేందుకు బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించిన సర్కార్. రైతు బీమా పథకానికి బడ్జెట్లో రూ.1,589 కోట్ల నిధులను అలకేట్ చేసిన భట్టి విక్రమార్క. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్ కోసం తాజా బడ్జెట్లో రూ.3,683 కోట్ల నిధులను అందించిన తెలంగాణ ప్రభుత్వం , డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,511 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు కేటాయించిన తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయింపు ,ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ 1,023 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి భట్టి. రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు కేటాయించిన భట్టి విక్రమార్క విద్యుత్ రాయితీ స్కీమ్ కింద రూ.11,500 కోట్లు వార్షిక బడ్జెట్లో కేటాయించిన తెలంగాణ సర్కార్.