हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Bhanu Prakash Reddy: డీజీపీకి లేఖ రాసిన టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి

Ramya
Bhanu Prakash Reddy: డీజీపీకి లేఖ రాసిన టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి

Bhanu Prakash Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వ్యవహారాల్లో వైసీపీ నేతలు కావాలనే గందరగోళం సృష్టిస్తూ,

పాలనను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయినందువల్లే ఇటువంటి కుట్రలతో రాజకీయ దాడులకు దిగుతోందని ఆయన విమర్శించారు.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం భారత దేశంలోని అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి.

ఇలాంటి ఆలయం పరిపాలనపై విమర్శలు చేస్తూ, నకిలీ వార్తలు, వీడియోలతో ప్రజల్లో భ్రాంతులు కలిగించాలన్న వైసీపీ ప్రయత్నం తగదని ఆయన స్పష్టం చేశారు.

భానుప్రకాశ్ రెడ్డి లేఖలో చెప్పినదాని ప్రకారం, ఇటీవల టీటీడీపై వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తూ, గోశాల నిర్వహణపై అసత్య సమాచారాన్ని ప్రచారం చేశారని తెలిపారు.

టీటీడీ (TTD) గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్

భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో కొన్ని నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు.

కానీ అవన్నీ నమ్మదగని, అవాస్తవమైనవని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వాటిని కావాలనే విడుదల చేశారని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా, వైసీపీ నాయకులు తిరుమల కొండపై ఒక వ్యక్తితో అన్యమతానికి సంబంధించిన ప్రార్థనలు చేయించి,

ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

క్యూ లైన్లను సరిగ్గా నిర్వహించడం లేదని, భక్తులను సరిగ్గా పట్టించుకోవడం లేదని కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని టీటీడీ సభ్యుడు పేర్కొన్నారు.

Bhanu Prakash Reddy
టీటీడీ పరిపాలనపై దాడి ద్వారా ఎన్డీయేను లక్ష్యంగా?

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలు రాజకీయంగా నిరుద్యోగులుగా మారారని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు.

“ఈ ఘటనలు యాదృచ్ఛికంగా లేదా అకస్మాత్తుగా జరిగినవి కావు. ఇవి ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న నేరపూరిత కుట్ర అని నేను అనుమానిస్తున్నాను.

ఈ కుట్ర వెనుక వైసీపీ అగ్ర నాయకుల హస్తం ఉందని కూడా నేను భావిస్తున్నాను” అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Bhanu Prakash Reddy
దర్యాప్తు జరిపించాలి – డీజీపీకి విజ్ఞప్తి

ఈ పరిస్థితుల్లో టీటీడీ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని,

దీని వెనుక ఉన్న కుట్రలను పూర్తిగా వెలికితీయాల్సిన అవసరం ఉందని భానుప్రకాశ్ రెడ్డి డీజీపీని కోరారు.

ఈ కుట్రలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కాదని, ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నవని,

ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు.

టీటీడీ వంటి విశ్వసనీయ సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని, ఈ అంశంపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Read also: Nara Lokesh: వైసీపీ పై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్
0:34

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు!

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు!

వైద్య కళాశాలల విషయంలో జగన్ ‘కోటి సంతకాల డ్రామా’

వైద్య కళాశాలల విషయంలో జగన్ ‘కోటి సంతకాల డ్రామా’

📢 For Advertisement Booking: 98481 12870