బుక్కైన సెలెబ్రిటీలు.. రానా, విజయ దేవరకొండ, మంచులక్ష్మి

betting app : బుక్కైన సెలెబ్రిటీలు.. విజయ దేవరకొండ, మంచులక్ష్మి, రానా

బెట్టింగ్ యాప్‌ల రచ్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను తాకింది. గత కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీస్ చర్యలు చేపట్టింది. ఈ తరుణంలోనే యూట్యూబర్ల నుండి ఆర్టిస్టులకు వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటో చేస్తున్నవారిపై కేసులు కూడా నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, విజయ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా ఇతరుల కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆరుగురు సినీ ప్రముఖులు, 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లపై ఈ కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 318 (4), 112 r/w 49, తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3, 3 (A) అండ్ 4 అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2008లోని 66D కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) బుక్ చేసారు.

బుక్కైన సెలెబ్రిటీలు.. రానా, విజయ దేవరకొండ, మంచులక్ష్మి

మియాపూర్ నివాసి ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు
మియాపూర్ నివాసి ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్స్ ఇంకా ఇతర ప్లాట్‌ఫామ్స్ ని చాల మంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లను ప్రోత్సహిస్తున్నారని అతను పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం సమాజాన్ని ఇంకా యువతకు హాని కలిగిస్తున్నాయని, వీటి బారిన పడి తీవ్ర ఆర్ధిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టాన్ని ఉల్లంఘించి జూదం ఆడటాన్ని ప్రోత్సహించే మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్‌ల గురించి ఆందోళన వ్యక్తం చేసిన వినయ్ వంగల (40) అనే ప్రైవేట్ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఈ సోమవారం 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై కేసు బుక్ చేశారు.

Related Posts
‘కొండల్’ (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
kondal movie review

కొండల్: రివేంజ్ డ్రామాతో కూడిన సముద్ర సాహస గాథ 2023లో మలయాళంలో విడుదలైన సినిమాల్లో కొండల్ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇది రివేంజ్ డ్రామాతో కూడిన Read more

రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు ఆగ్రహం
రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు ఆగ్రహం

'ఇండియాస్ గాట్ టాలెంట్ (IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..? మీ Read more

డీప్‌సీక్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే జైలు శిక్ష
deepseek

కృత్రిమ మేధస్సులో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా సెనేటర్ జోష్ హాలే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే డీప్‌సీక్ వంటి చైనా అభివృద్ధి Read more

అల్లుఅర్జున్ అరెస్ట్ పై ప్రముఖుల స్పందన
revanth reddy 292107742 16x9 0

శుక్రవారం ఉదయం జరిగిన సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *