benjamin netanyahu solidarity message to iranians

ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ ఎప్పటికీ అండగా ఉంటుంది: నెతన్యాహు

benjamin-netanyahu-solidarity-message-to-iranians

ఇజ్రాయెల్‌: హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్‌ పౌరులకు సంఘీభావంగా మాట్లాడిన ఆయన.. ఆ దేశ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. ఆ దేశంలోని నిరంకుశ పాలనను త్వరలోనే అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందిస్తామన్నారు. ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.

”ప్రతి రోజూ మీ పాలకులు మిమ్మల్ని అణచివేస్తూ గాజా, లెబనాన్‌ను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూస్తూనే ఉన్నారు. వారి చర్యల కారణంగా మన ప్రాంతం మరింత అంధకారంలోకి వెళ్తోంది. యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్‌ నిరంకుశ పాలకులు మీ భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదని మీలో చాలా మందికి తెలుసు. వారు మీ గురించి ఆలోచించి ఉంటే.. కోట్లాది డాలర్లను మధ్యప్రాచ్యంలో యుద్ధాల కోసం వెచ్చించరు. ఆ డబ్బును అణ్వాయుధాల కోసం కాకుండా.. మీ జీవితాలు బాగు చేసేందుకు ఉపయోగించేవారు. మీ పిల్లల చదువు, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఉపయోగించేవారు. కానీ, మీ పాలకులు అలా చేయట్లేదు” అని నెతన్యాహు వెల్లడించారు.

”హెజ్‌బొల్లాకు చెందిన హంతకులు, అత్యాచారం చేసేవారిని మీరు సమర్థించరని నాకు తెలుసు. కానీ, మీ పాలకులు అలా కాదు. అందుకే, ఇరాన్‌ కీలుబొమ్మలను మేం ఒక్కొక్కటికీ పెకిలించివేస్తున్నాం. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఇలాంటి పాలకులు మీకు అక్కర్లేదు. త్వరలోనే ఆ నిరంకుశ పాలన నుంచి మీకు విముక్తి కల్పిస్తాం. అప్పుడు రెండు దేశాల్లో మళ్లీ శాంతి నెలకొంటుంది” అని నెతన్యాహు పరోక్షంగా ఇరాన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గతేడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపుదాడి తర్వాత మొదలైన యుద్ధం ఇప్పుడు మరింత విస్తరించింది. మొన్నటివరకు గాజాపై భీకర దాడులు సాగించిన నెతన్యాహు సర్కార్‌.. ఇప్పుడు హెజ్‌బొల్లాపై దృష్టిపెట్టింది. ఇప్పటికే ఆ సంస్థ అధినేత నస్రల్లాను అంతమొందించింది. ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుల్లో పరిమిత స్థాయిలో భూతల దాడులు మొదలుపెట్టింది. అటు హెజ్‌బొల్లా కూడా దీర్ఘకాల యుద్ధానికి సై అనడం, దీనికి ఇరాన్‌ మద్దతివ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కన్పించట్లేదు.

Related Posts
KTR vs Surekha : పరువు నష్టం కేసు విచారణ వాయిదా
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

మంత్రి కొండా సురేఖపై పెట్టిన పరువునష్టం దావాపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను నవంబర్ 13కు వాయిదా వేయడం జరిగింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో Read more

బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయం: కరెన్సీ నోట్లలో మార్పులు
bangladesh notes

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, దేశ వ్యవస్థాపక పితామహుడు ముజిబుర్ రహమాన్ చిత్రాలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించే ప్రణాళికను ప్రారంభించింది. కొత్త కరెన్సీ నోట్లలో రమణీయమైన మత Read more

ఏ2 గేదె పాలను పరిచయం చేసిన సిద్స్ ఫార్మ్
Sid's Farm introduced A2 buffalo milk

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రముఖ డి2సి డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్ , ఇటీవల తమ ఏ2 బఫెలో మిల్క్‌ను కొత్త 1-లీటర్ అసెప్టిక్ ప్యాకేజింగ్ Read more

ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్‌ పర్యటన
cm revanth sgp

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్‌ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఆదివారం ముగిసిన ఈ పర్యటనలో సింగపూర్‌ వ్యాపార Read more