హసీనా ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు
షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ 15 ఏళ్ల పాలనలో విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపణలు. గత సంవత్సరం 800 మందికి పైగా మరణించిన నిరసన ఉద్యమంపై హింసాత్మకంగా అణిచివేసిందన్న విమర్శలు. UN హక్కుల కార్యాలయం నివేదిక ప్రకారం, హత్యలు, హింస, అన్యాయమైన జైలు శిక్షలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.

హసీనా పార్టీ నిషేధంపై విద్యార్థుల డిమాండ్
హసీనా తండ్రి నేతృత్వంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా ఉన్న ఆవామీ లీగ్‌ను నిషేధించాలని విద్యార్థి నాయకుల డిమాండ్. గత సంవత్సరం జరిగిన విద్యార్థి విప్లవంలో వందల మంది సహచరులు మరణించడంతో విద్యార్థులు పార్టీపై నిషేధం విధించాలని గట్టిగా పట్టుబడుతున్నారు.
“పార్టీ నిషేధించకపోతే దేశం అంతర్యుద్ధం వైపు వెళ్తుంది” అని విద్యార్థి నాయకులు హెచ్చరిక చేసారు.
పార్టీపై నిషేధం లేదు
తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడు, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్, ఆవామీ లీగ్‌ను నిషేధించే ఉద్దేశం లేదని ప్రకటించారు. అయితే పార్టీకి చెందిన వ్యక్తులు హత్యలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడినట్లయితే, వారిని కోర్టుల్లో విచారిస్తారు అని అన్నారు.
హసీనా భారతదేశంలో ఆశ్రయం – అరెస్ట్ వారెంట్లు జారీ
హసీనా పదవీచ్యుతి అయిన తర్వాత భారతదేశంలో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆమెపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. తదుపరి ఎన్నికల నాటికి ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం.
విపక్ష పార్టీల విమర్శలు
ప్రముఖ విద్యార్థి మద్దతుగల రాజకీయ నాయకుడు హస్నత్ అబ్దుల్లా – “ఆవామీ లీగ్‌ను నిషేధించాలి” అని ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఇస్లామిక్ పార్టీ జమాత్ నాయకుడు షఫీకుల్ రెహమాన్ – “ఆవామీ లీగ్ పునరావాసాన్ని ప్రజలు అంగీకరించరు” అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో విద్యార్థి ఉద్యమం మరింత ఉధృతమయ్యే సూచనలు.