हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Ramya
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం: కేసీఆర్, కేటీఆర్‌లను విచారించాలని బండి సంజయ్ డిమాండ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సిట్ దర్యాప్తు కేవలం “తూతూమంత్రంగా” సాగుతోందని విమర్శించారు.

సిట్ దర్యాప్తుపై బండి సంజయ్ అసంతృప్తి

Bandi Sanjay: సిట్ దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారని, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన ఆయనకు “రాచమర్యాదలు” చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుమ్మక్కును స్పష్టం చేస్తుందని ఆయన అన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లను విచారించాలని డిమాండ్

బండి సంజయ్ సంచలన డిమాండ్ చేశారు. “పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేశామని రాధాకిషన్‌రావు (Radhakishan Rao)వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) నోటీసులిచ్చి విచారించాలి” అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, సిరిసిల్ల కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్‌ను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, దీని వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేయాలని కోరిక

ఈ కేసును తక్షణమే సీబీఐకి (CBI) బదిలీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కేంద్రానికి నేరుగా సీబీఐ విచారణ జరిపే అధికారం ఉంటే నిందితులను ఎప్పుడో చట్టప్రకారం శిక్షించేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిజమైన దోషులను బయటపెట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోషులకు శిక్ష పడే వరకు పోరాటం ఆగదని ఆయన అన్నారు.

Read also: Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870