దాయాది పాకిస్థాన్‌కు బలూచిస్థాన్‌లో (Balochistan Pakistanవేర్పాటవాద ఉద్యమం తీవ్రమైన అంతర్గత ముప్పుగా మారుతోంది. ఈ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి సాయుధ వేర్పాటవాద గ్రూప్‌లు.. పాకిస్తాన్ సైన్యంపై తరచూ దాడులు చేస్తుండటం తలనొప్పిగా మారింది. భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” చేపట్టి పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన సమయంలోనే BLA రెండు భారీ దాడులు చేసిన పాక్ సైన్యంలో 14 మందిని హతమార్చింది. బోలన్‌లోని మాచ్ ప్రాంతంలో ఓ ఆర్మీ కాన్వాయ్‌పై IED దాడి జరిగినట్లు BLA పేర్కొంది. అలాగే కేచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌పై మరో దాడి చేశారు.

బలూచిస్థాన్ సమస్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారం
ప్రపంచం తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్థాన్ నుంచి ఉపసంహరించుకుని, కొత్తగా ఆవిర్భవిస్తోన్న బలూచిస్తాన్ దేశానికి తరలించాల్సిన సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. .బలూచిస్థాన్ సమస్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారమే అయినా, మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు చైనా–పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (CPEC) భద్రతపై ప్రభావం చూపుతుండటంతో అంతర్జాతీయ ఆసక్తి పెరుగుతోంది.
రెపరెపలాడుతున్న ప్రత్యేక బలోచ్ జెండాలు
తాజాగా, బలూచిస్థాన్‌లో ప్రజలు అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, స్మారక చిహ్నాలపై పాకిస్థాన్ జెండాలను తొలగించి.. వాటి స్థానంలో ప్రత్యేక బలోచ్ జెండాలను ఎగురువేస్తున్నాారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్.. ‘‘ప్రపంచం తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్థాన్ నుంచి ఉపసంహరించుకుని, కొత్తగా ఆవిర్భవిస్తోన్న బలూచిస్థాన్ దేశానికి తరలించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ ట్వీట్ చేసి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక అకౌంట్, వ్యక్తిగత అకౌంట్‌లను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Operation Sindoor: ‘భారత్‌కు అండగా నిలబడాలి’- యూకే ఎంపీ ప్రీతి పటేల్