రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో (In Katedan, Rangareddy district) గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నేతాజీ నగర్‌లో ఉన్న తిరుపతి రబ్బర్ కంపెనీలో (Rubber Factory) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో రబ్బర్ సామగ్రి పెద్ద మొత్తంలో నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.ఉదయమే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొగతో పరిసరాలు నిండిపోయాయి. గోడల నుంచి మంటలు ఎగసిపడటం చూసినవారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలపై కంట్రోల్
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను నియంత్రించే ప్రయత్నాలు ప్రారంభించారు. వారి శ్రమతో కొద్దిసేపటిలోనే మంటలు అదుపులోకి వచ్చాయి.ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేరు. ఇది ఒక రకంగా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లైంది. లేకపోతే ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉండేది.
పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు పరిశీలన
మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘటన స్థలాన్ని సందర్శించాయి. కంపెనీలో ప్రధానంగా కార్లలో ఉపయోగించే రబ్బర్ మ్యాట్లు తయారవుతున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Read Also : Indiramma house grant : ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నించి బలయ్యిన యువకుడు