పుతిన్‌పై హత్యాయత్నం .. కారులో భారీ పేలుడు

Putin: పుతిన్‌పై హత్యాయత్నం .. కారులో భారీ పేలుడు

ఓ వైపు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న క్రమంలో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కారులో భారీ పేలుడు సంభవించింది. పుతిన్ అధికారికంగా ఉపయోగించే ఆరస్ సీనట్ అనే పేరు గల కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటన రష్యా రాజధాని మాస్కోలోని లుబియాంకా ఏరియాలో ఉన్న రష్యా గూఢచార సంస్థ ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం సమీపంలోనే జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పుతిన్‌పై హత్యాయత్నం .. కారులో భారీ పేలుడు

పుతిన్ అధికారిక కారులో పేలుడు
పుతిన్ అధికారిక కారులో పేలుడు సంభవించగానే కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పుతిన్ అధికారికంగా వినియోగించే కారు వెనక భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ కారులో పేలుడు ఎలా సంభవించింది ? లోపల ఎవరైనా పేలుడు పదార్థాలు అమర్చారా ? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించడంపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది.


జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
పుతిన్ త్వరలో చనిపోతారని.. యుద్ధం ముగిసిపోతుందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈలోపే ఇలా జరగడంపై రష్యా వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల రష్యాలోని ముర్మాన్స్క్ ప్రాంతంలో పర్యటించిన పుతిన్.. అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు గురించి మాట్లాడారు. జెలెన్‌ స్కీ దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే శాంతి ఒప్పందంపై సంతకం జరుగుతుందని స్పష్టం చేశారు.

Related Posts
నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నాండి-న్డైత్వా
namibia president

నమీబియా యొక్క శాసనసమితి సభ్యులుగా ఉండే SWAPO పార్టీకి చెందిన నేత నెటుంబో నాండి-న్డైత్వా నమీబియా కొత్త రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆమె ఈ దేశానికి తొలి మహిళా Read more

విమాన ప్రమాదం:ఆందోళనలో పలు కుటుంబాలు
plane crash

సౌత్ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు తమ Read more

మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ
Prime Minister Modi arrives in Mauritius

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో Read more

సింగ‌పూర్ లో తెలంగాణ కల్చ‌ర‌ల్ మీట్ లో సీఎం రేవంత్
CM Revanth at Telangana Cul

సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *