YoungGirls : విదేశాల్లో ఉన్నపుడు అమ్మాయిలుగా ..ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

YoungGirls : విదేశాల్లో ఉన్నపుడు అమ్మాయిలుగా ..ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

భారతీయ యువతి సుదీక్షణ విహారయాత్రకు వెళ్లి అమెరికాలో అదృశ్యమైన ఘటన ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది. ఇదే సమయంలో, కెనడాలో చదువుతున్న ఓ యువతిపై పబ్లిక్‌గా దాడి జరిగిన వీడియో వైరల్ అవుతోంది. ఇటువంటి సంఘటనలు విదేశాల్లో విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలను అన్వేషించే భారతీయ యువత, అక్కడి కొత్త వాతావరణం, భిన్న సంస్కృతి, భద్రతా సమస్యలను తట్టుకొని ముందుకు వెళ్లాలి. అందుకే, కొన్ని కీలకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

ఒంటరిగా వెళ్లకండి

ఫోన్ చూసుకుంటూ నడవడం, హెడ్ఫోన్స్ పెట్టుకుని చుట్టూ ఏం జరుగుతుందో గమనించకుండా ఉండడం ప్రమాదకరం.చాలా యూనివర్సిటీల్లో ఎస్కార్టెడ్ వాక్స్, ఎమర్జెన్సీ హాట్‌లైన్లు, భద్రతా యాప్స్ ఉంటాయి. వీటి వివరాలను తెలుసుకొని ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.క్యాంపస్‌ లలో ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (బ్లూ లైట్ ఫోన్‌)లు ఎక్కడ ఉన్నాయో ముందుగా గుర్తించాలి.రాత్రివేళల్లో ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకుండా ఉండటమే మంచిది.

క్రైమ్ రేటు

ఏ దేశానికి వెళ్లినా, మీరు చేరబోయే విద్యాసంస్థతో పాటు ఆ ప్రాంత భద్రతా విషయాలను కూడా పరిశీలించాలి.అక్కడి క్రైమ్ రేటు ఎలా ఉందో ముందుగా తెలుసుకోవాలి.భారత పౌరులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలు, విశ్వవిద్యాలయాలు చేసే ట్రావెల్ అలర్ట్స్ వంటి సమాచారాన్ని సేకరించాలి.సురక్షితమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి.అపరిచితులతో రూమ్ షేర్ చేసుకోవడం మానుకోవాలి.అద్దెకు ఇల్లు తీసుకునే ముందు యజమానుల విశ్వసనీయతను, ఇంటి భద్రతను కచ్చితంగా పరిశీలించాలి.

Capture

వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు

మీరు ఉండే హాస్టల్, అపార్ట్‌మెంట్ గురించి, యాక్సెస్ కోడ్లు ఇతరులతో పంచుకోవద్దు.మీ అడ్రస్, క్లాస్ షెడ్యూల్, ట్రావెల్ ప్లాన్స్ వంటి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.స్నాప్‌చాట్, ఇతర యాప్‌లలో లొకేషన్ ట్రాకింగ్‌ను డిసేబుల్ చేయండి.తెలియని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దు. వెళ్లాల్సి వస్తే నమ్మకమైన స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు లొకేషన్ లైవ్ షేర్ చేయండి.

మీ హక్కులను తెలుసుకోండి

ఆ దేశంలోని చట్టాలు, విదేశీయులుగా మీకు ఉండే హక్కులను ముందుగా తెలుసుకోవాలి.అత్యవసర సమయంలో సహాయం కోరే పదాలను స్థానిక భాషలో నేర్చుకోవడం మంచిది.అత్యవసర నంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.అమెరికాలో – 911 ,యుకేలో – 999 ,యూరప్‌లో – 112 ,భారత రాయబార కార్యాలయ వివరాలను ముందుగానే పొందుపరచుకోవాలి.

భద్రతా సూచనలు

విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అన్వేషించే భారతీయ విద్యార్థినుల భద్రత అత్యంత ప్రాముఖ్యం కలిగినది. కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు పాటిస్తే అనుకోని ప్రమాదాలను నివారించుకోవచ్చు. సురక్షితంగా ఉండటం, అప్రమత్తంగా ఉండటం, అవసరమైనప్పుడు సహాయం కోరటం – ఇవన్నీ కీలకం. విదేశాల్లో ఉన్నత చదువులే కాకుండా, వ్యక్తిగత భద్రత కూడా అత్యవసరం అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

Related Posts
త్వరలో ఏపీలో ‘హ్యాపీ సండే’: చంద్రబాబు
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ..ఉగాది రోజున ‘పీ4’ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీలో త్వరలో ‘హ్యాపీ సండే’ కూడా ప్రారంభిస్తామని, మనుషుల Read more

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా
Priyanka Gandhi Vadra entered the Lok Sabha for the first time

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, Read more

దోచేసిన నల్ల డబ్బుతో సేద్యం చేస్తావా ఏంటి..?: సోమిరెడ్డి
somireddy chandra mohan reddy comments on vijayasai reddy

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి Read more

తిరుపతి తొక్కిసలాట..ప్రధాని, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
Tirupati stampede..Prime Minister, Revanth Reddy shocked

తిరుమల: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరో 60 మందికి గాయాలయ్యాయి. వారందర్నీ తిరుపతిలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *